ముంచేసిన వర్షాలు

SRD: సదాశివపేట పరిసర ప్రాంతాలలో బుధవారం భారీ వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గత నెలలో కురిసిన వర్షానికి పూర్తిగా పంటనష్టం వాటిల్లిందని తెలిపారు. దానికి తోడు నేడు కురుసిన వర్షానికి ఉన్న పంటలు కాస్త దెబ్బతినే అవకాశం ఉందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.