ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

MDK: పవిత్రమైన రంజాన్ మాసం సోదరభావం, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీకని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు పేర్కొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింల కోసం మెదక్ క్రిస్టల్ గార్డెన్స్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం ప్రేమ, శాంతి, సహకారం పెంపొందించే పవిత్రమైన కాలమని అన్నారు. ఉపవాస దీక్షతో మనసును పవిత్రం చేసుకోవడం జరుగుతుందన్నారు.