బైక్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

చిత్తూరు: కోట మండలం కొక్కుపాడు మలుపు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోట నుంచి కొక్కుపాడుకు బైకు మీద వస్తున్న వ్యక్తికి ఆర్టీసీ బస్సు వెనక భాగం తగలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని కోట ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.