తోలేరులో నాటికల సందడి
W.G: తోలేరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అఖిల భారత స్థాయి సామాజిక నాటిక పోటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. శనివారం రాత్రి కాట్రపాడు, చిలకలూరిపేటకు చెందిన రెండు కళా పరిషత్ నాటికలను ప్రదర్శించారు. 'మంచి మనసులు', 'మా ఇంట్లో మహాభారతం' పేర్లతో ప్రదర్శించిన ఈ నాటికలు ప్రేక్షకులలో ఉత్సాహాన్ని నింపుతూ, ఆలోచింపజేశాయని పలువురు తెలిపారు.