VIDEO: కిక్కిరిసిన సలేశ్వరం.. భక్తుల పడికాపులు
NGKL: లింగాల మండలం నల్లమల అడవుల్లో సలేశ్వరం లింగమయ్య జాతర భక్తులతో కిక్కిరిసిపోయింది. పౌర్ణమి కావడంతో స్వామివారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. లోయ ప్రాంతం భక్తజనసంద్రం కావడంతో దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. రాత్రి కావడంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.