VIDEO: మాజీ మావోయిస్టులకు ఘనంగా సన్మానం

VIDEO: మాజీ మావోయిస్టులకు ఘనంగా సన్మానం

MNCL: మందమర్రి పట్టణానికి చెందిన మాజీ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాశ్, అపాసి నారాయణకు ఆదివారం CER క్లబ్‌లో ఘన సన్మానం జరిగింది. 3 దశాబ్దాల పాటు పార్టీలో పనిచేసిన వీరు, ఇటీవల అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలో కలిశారు. మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు స్వయంగా డప్పు వాయిస్తూ వారికి సాదర స్వాగతం పలికారు. పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు.