'డిజిటల్ హెల్త్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి'
నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ హెల్త్ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని VC శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. VSU సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో PM–USHA సహకారంతో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌పై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో వీసీ మాట్లాడుతూ.. ఆభా అకౌంట్ ద్వారా ఆరోగ్య సేవలు సులభతరం అవుతాయన్నారు.