కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

మేడ్చల్: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. ఘనాపూర్ కు  చెందిన గుమ్మడిదల శివశంకర్ భార్య లత నాలుగేళ్ల క్రితం గొడవపడి పుట్టింటికి వెళ్లింది. దీంతో శివశంకర్ పెద్దలతో కలిసి భార్యను తీసుకు వచ్చేందుకు వెళ్లగా ఆమె రాలేదు. మనస్తాపం చెందిన శివశంకర్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.