చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవు
MDK: తూప్రాన్ మున్సిపాలిటీలోని 4వ వార్డ్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, 4వ వార్డ్ కౌన్సిలర్ జైపాల్ నాయక్‌తో కలిసి మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేసేవారిపై జరిమానా విధించబడుతుందని, అందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.