పిల్లల్లో వినికిడి లోపం.. ప్రతి 1000 మందిలో నలుగురికి
HYD: పిల్లల్లో వినికిడి లోపం పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. కొంత మంది శిశువులకు పుట్టుకతోనే వినిపించక పోవడం, మరికొందరికి ఇన్ఫెక్షన్లు, ఇతర కారణాలతో సమస్యలు వస్తున్నాయి. HYD ENT ఆసుపత్రి సహా పలు ఆసుపత్రుల్లో కేసులు పెరుగుతున్నాయి. ప్రతి 1000 శిశువుల్లో నలుగురికి ఈ సమస్య ఉందని గుర్తించారు. పుట్టిన వెంటనే వినికిడి పరీక్షలు తప్పనిసరని వైద్యులు తెలిపారు.