నవీన్ యాదవ్‌కు ప్రభుత్వ విప్ పదవి..?
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు ప్రభుత్వ విప్ పదవి దక్కే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆయనకు ఈ పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముగ్గురు విప్‌లు ఉండగా, మరో నలుగురిని నియమించేందుకు అవకాశం ఉంది.