'చర్చలతో కాలయాపన వద్దు.. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి'
కర్నూలు: వెనకబడ్డ ఆదోని అభివృద్ధి జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమని జేఏసీ నాయకులు తెలిపారు. బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం నుంచి జిల్లా ఏర్పాటుపై సానుకూల ప్రకటన వచ్చేవరకు వివిధ రూపాలలో ఆందోళన కొనసాగిస్తామన్నారు. చర్చలతో కాలయాపన చేయకుండా ఆదోని జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాలని నాయకులు రఘురామయ్య, కోదండ లలిత, వీరేశ్ పేర్కొన్నారు.