డయాబెటిస్ ఉంటే కనిపించే లక్షణాలు
ప్రతి ఏడాది నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డే నిర్వహిస్తారు. డయాబెటిస్ ఉంటే శరీరంలో ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటంటే..తరచుగా మూత్ర విసర్జన, అసాధారణంగా దాహం, ఆకలి, బరువు తగ్గడం, గాయాలు నెమ్మదిగా నయమవ్వడం, అలసట, బలహీనత, దృష్టి మసకబారడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు.