సీఎంను కలిసిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలు

HYD: సీఎం రేవంత్ రెడ్డిని వివిధ విభాగాలలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డులకు ఎంపికైన పలువురు సినీ ప్రముఖులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయాలను అందిస్తుందన్నారు.