అంతర్జాతీయ డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టు రట్టు
AP: భీమవరంలో అంతర్జాతీయ డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టు రట్టయింది. నేరగాళ్లకు భయపడి 13 రోజుల్లో రూ.78 లక్షలు కోల్పోయిన రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మ క్రైం బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో పోలీసులు మొత్తం 14 మంది నిందితులను గుర్తించారు. వీరిలో 13 మంది అరెస్ట్ కాగా.. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. కాంబోడియా నుంచి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది.