జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం: పలాస మండలం నెమలి నారాయణపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.