రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
WGL: పర్వతగిరి మండలం చౌటుపల్లి గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై గురువారం ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు మండలంలోని గోపనపల్లి నాంపల్లి అన్నయ్యగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.