త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలం పాలన్నగారిపల్లి గ్రామం కుమ్మరపల్లిలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం దోరికింది. రూ. 2.5 లక్షల వ్యయంతో నూతన బోర్‌వెల్‌ను టీడీపీ నాయకుడు డా. మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. గ్రామంలో ఏళ్లుగా కొనసాగుతున్న మంచినీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు.