'బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం'
GNTR: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, 18 ఏళ్లు నిండని బాలికలకు, 21 ఏళ్లు నిండని యువకులకు వివాహాలు చేయవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దిన్ సూచించారు. బాల్య వివాహాలు, గిరిజన మహిళల్లో తక్కువ వయసులో గర్భధారణపై సోమవారం బుడంపాడు ఎస్టీ కాలనీలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జియావుద్దిన్ మాట్లాడారు.