సూళ్లూరుపేట హెడ్ కానిస్టేబుల్‌కు సేవా పతకం

సూళ్లూరుపేట హెడ్ కానిస్టేబుల్‌కు సేవా పతకం

TPT: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాల్లో సూళ్లూరుపేట హెడ్ కానిస్టేబుల్ షేక్ ఖాజా హుస్సేన్ ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో ఆయన అందించిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఈ పతకం లభించింది. ఈ పతకాన్ని ఉగాది వేడుకల సందర్భంగా ప్రభుత్వం అందజేయనుంది. సేవా పతకం సాధించిన ఖాజా హుస్సేన్‌ను పలువురు పోలీస్ అధికారులు అభినందించారు.