HYDలో 115 విమానాలు రద్దు!
HYD: దేశవాప్తంగా 6వ రోజు ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. HYDలో ఇండిగో సంస్థ 115 విమానాలను రద్దు చేసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 54 విమానాలు, శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 61 విమానాలు, వీటితో పాటు మరి కొన్ని విమానాలను రద్దు చేసింది. దీంతో ఇండిగో సంక్షోభంపై వివరణ ఇవ్వాలని DGCA ఇండిగో సీఈవో పీటర ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.