రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
NLR: కలిగిరి మండలం జిర్రావారిపాలెంలో శ్రీకోదండ రామస్వామి ఆలయ నిర్మాణానికి MLA సురేశ్ శంకుస్థాపన చేశారు. వేద పండితుల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఆలయ నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరు చేయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.