మృతుల కుటుంబాలను పరామర్శించిన MLA
SDPT: దూల్మిట్ట మండలం జలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. బీఆర్ఎస్ నేత పాలెపు సత్యనారాయణ భార్య ప్రమీల, వార్డ్ మెంబర్ గంగుల సత్తయ్య తల్లి బాలమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.