తెల్లవారుజాము నుంచే పోలీసుల తనిఖీలు

WGL: వరంగల్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు గురువారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు గంజాయి రవాణా, పాత నేరస్థులను గుర్తించేందుకు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్పర్జన్ రాజ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. స్టేషన్‌లోని అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి, వారి బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రయాణికులకు పలు సూచనలు చేశారు.