టీఎన్జీవోస్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి
నల్గొండ జిల్లా టీఎన్జీవోస్ జిల్లా డైరీ, క్యాలెండర్‌ను ఈరోజు హైదరాబాద్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు , సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డైరీ, క్యాలెండర్ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.