భయపెడుతున్న భానుడు..!
MDCL: నగరంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ కూడా దాదాపు 40 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనాలు బయటికి రావాలంటే బయపడి, ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కాగా, అధిక ఎండల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.