వసతీ గృహాన్ని సందర్శించిన కలెక్టర్

వసతీ గృహాన్ని సందర్శించిన కలెక్టర్

MBNR: సంక్షేమ వసతి గృహాలలో చదివే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం నవాబుపేట మండలం యన్మన్ గండ్ల బీసీ బాలికల సంక్షేమ వసతీ గృహాన్ని సందర్శించారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నీళ్ల సాంబార్ కూరగాయలు లేని భోజనాన్ని గమనించిన కలెక్టర్ వసతి గృహ సంక్షేమ అధికారిని పై ఆగ్రహం వ్యక్తం చేశారు.