గురుకుల బాలికల పాఠశాలలో MLA తనిఖీ

గురుకుల బాలికల పాఠశాలలో MLA తనిఖీ

NLR: రాపూరు గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బుధవారం తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులను బాలికలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వారి చదువు, వసతులు, ఆహారంపై ఆరా తీశారు. వంటశాలను పరిశీలించి నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హాస్టల్ గదులు, తరగతి గదులు, తాగునీరు తదితర సదుపాయాలను పరిశీలించారు.