శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు

శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు

KDP: గోపవరం మండలంలోని వల్లేరవారిపల్లెలో వెలసిన స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు శ్రావణ మాస ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి పూజాభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని వెండి ఆభరణాలతో, తోరణమాలలతో అలంకరించారు. భక్తులకు దర్శనం కల్పించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.