VIDEO: మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తోటలో ఉద్రిక్తత

W.G: దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఫామాయిల్ తోటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు తోటలోకి ప్రవేశించి, కర్రలు, రాడ్‌లతో వీరంగం సృష్టించినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. తమ తోటలోకి వచ్చి తమనే బెదిరిస్తారా? అని అబ్బయ్య చౌదరి వారిపై మండిపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గీయులను చెదరగొట్టారు.