VIDEO: 'పార్కుల్లో నడకకు పన్ను లేదు'
విశాఖలోని సాధారణ పార్కుల్లో నడకపై రుసుములు వసూలు చేస్తున్నారన్న ప్రచారం అవాస్తవమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. సాధారణ పార్కుల్లో ఎలాంటి చార్జీలు లేవని, కేవలం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, శివాజీ పార్క్ వంటి నిర్దిష్ట ప్రాంగణాల నిర్వహణ కోసం మాత్రమే స్వల్ప వినియోగ రుసుములు ఉన్నాయని వివరించారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.