విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ
CTR: పుంగనూరు(మం) గూడూరు పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం STU మండల శాఖ ఆధ్వర్యంలో సంఘ నాయకులు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారమే కాకుండా విద్యార్థుల సంక్షేమాన్ని గుర్తించి నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయుల చేత స్టడీ మెటీరియల్ రూపొందించినట్లు సంఘ నాయకులు తెలిపారు.