సిజేరియన్‌తో పిల్లలకు క్యాన్సర్ ముప్పు!
నార్మల్ డెలివరీతో జన్మించిన శిశువులతో పోలిస్తే సిజేరియన్ ద్వారా పుట్టిన పిల్లల్లో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా(ALL) వచ్చే అవకాశం ఎక్కువ ఉండొచ్చని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. నార్మల్ డెలివరీ సమయంలో బిడ్డపై ఉండే మంచి బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థను బలపరచడంతోపాటు అలర్జీలు, ఆటోఇమ్యూన్ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడైంది.