VIDEO: వర్ధన్నపేటలో డ్రైవర్లకు ‘కంటి వెలుగు’ శిబిరం
WGL: వర్ధన్నపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్ల కోసం ‘కంటి వెలుగు’ శిబిరం నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య గురువారం తెలిపారు. వాహనదారులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు.పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు.