ఈ WTC సీజన్‌లో మనోళ్లదే పైచేయి

ఈ WTC సీజన్‌లో మనోళ్లదే పైచేయి

ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సీజన్‌లో టీమిండియా బ్యాటర్లు రాణిస్తున్నారు. ఎక్కువ రన్స్ చేసిన టాప్ 5 ప్లేయర్లలో మనోళ్లే నలుగురు ఉండటం విశేషం. కెప్టెన్ గిల్ 946 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. తర్వాతి 3 స్థానాల్లో KL రాహుల్(728), జైస్వాల్(630), జడేజా(620) ఉన్నారు. ఐదో స్థానంలో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్(537) ఉన్నాడు.