పంచాయతీ ప్రచారంలో ట్రాన్స్ జెండర్స్
కరీంనగర్: జిల్లాలో నామినేషన్ల పర్వం ముగుస్తుండటంతో అభ్యర్థులు తమ ప్రచార వేగం పెంచుతున్నారు. ఇంటింటికి వెళ్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే మానకొండూర్ మండలంలో పలువురు సర్పంచ్ అభ్యర్థులు సరికొత్తగా ప్రచారంలో ట్రాన్స్ జెండర్లను భాగస్వామ్యం చేసుకుంటున్నారు. వారి ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుందన్నసెంటిమెంట్‌తో వాళ్ల సపోర్ట్ కోరుతున్నారు.