మంత్రి కోమటిరెడ్డికి భట్టి విక్రమార్క ఆహ్వానం
NLG: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన కుమారుడు సూర్య ఎంగేజ్మెంట్‌కు హాజరు కావాలని ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నెల 26న జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి భట్టి దంపతులు హైదరాబాద్‌లోని మంత్రి కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మంత్రి మనవడితో సరదాగా గడిపారు.