VIDEO: పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
ప్రకాశం: కనిగిరి మండలం బడుగులేరు గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజాబాబు, MLA ఉగ్ర నరసింహా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల విద్యార్థులు కలుషిత నీరు తాగటం వల్ల పచ్చ కామెర్ల వ్యాధి సోకడంతో, గ్రామంలో పర్యటించి ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.