CISF కానిస్టేబుల్‌గా ఎంపికైన మారుమూల యువతి
MLG: ఏటూరునాగారం(M) రామన్నగూడెంకు చెందిన సుప్రియ CISF పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. 10 నెలల శిక్షణ పూర్తి చేసుకుని మధ్యప్రదేశ్ బరువ పరేడ్ గ్రౌండ్‌లో తల్లి సమక్షంలో ఇవాళ నియామక పత్రం అందుకుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన సుప్రియను తల్లి అన్నీ తానై చదివించింది. మారుమూల గ్రామం నుంచి కేంద్ర బలగాల్లో చేరిన ఆమెను గ్రామస్థులు అభినందించారు.