నేరేడుచర్ల ఎస్సైని అభినందించిన జిల్లా ఎస్పీ
SRPT: నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నరసింహ ఇవాళ సందర్శంచారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎస్సై రవీందర్ నాయక్‌ను అభినందించారు. ఇటీవల ప్రమాదవశాత్తు మూసీ నదిలో పడి మరణించిన బాలిక మృతదేహాన్ని వెలికితీయడంలో వేగంగా స్పందించి, బాధ్యతతో పనిచేసినందుకు ఆయనకు ప్రశంసలు లభించాయి. పోలీసు బృందం సమయస్ఫూర్తి, సేవాభావం ప్రశంసనీయమని ఎస్పీ పేర్కొన్నారు.