రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రాజాపేట విద్యార్థినులు

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రాజాపేట విద్యార్థినులు

యాదాద్రి: రాజాపేట మండలంలోని పాముకుంట జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు రంగా అబిక్షిత, నాయిని సుకన్య రాష్ట్రస్థాయి అండర్-15 వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారని ఎంఈఓ చందా రమేష్ తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో సరూర్‌నగర్‌లోని వాలీబాల్ అకాడమీలో జరిగే పోటీలలో వీరు జిల్లా తరఫున పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా వారిని ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.