'ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి'

JN: రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రభుత్వాన్ని కోరారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను రాజయ్య పరిశీలించారు. అక్కడే రైతులతో కలిసి నిరసనకు దిగారు. రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.