VIDEO: ఖమ్మం అంబేద్కర్ భవన్ వద్ద ఉద్రిక్తత.!
ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ బాధితులు రోడ్డుపై నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు తమపై దాడికి పాల్పడ్డారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసన తెలిపేందుకు కూడా తమకు హక్కు లేదా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధితులు ప్రశ్నించారు.