సీఎంను కలిసిన వెంకటరమణ రాజు

సీఎంను కలిసిన వెంకటరమణ రాజు

CTR: ముఖ్యమంత్రి చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గ పూర్వపు ఇంఛార్జి వెంకటరమణ రాజు శుక్రవారం సచివాలయంలో కలిశారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా పట్టణంలో అదనపు బోర్లు, అసంపూర్తిగా ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌‌లను అన్ని హంగులతో పూర్తిచేయాలని ఆయన కోరారు. పుంగనూరు, చౌడేపల్లి మండలాలకు అదనపు నిధులు కేటాయించాలని సీఎంకు వినతి పత్రం అందజేశారు.