'ప్రభుత్వం ద్వారా రైతులకు రాయితీ'
ప్రకాశం: గిద్దలూరు మండలం వెంగళరెడ్డిపల్లె గ్రామంలోని డ్రిప్ పరికరాలను ఉద్యానవన శాఖ అధికారిని శ్వేత బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బిందు సేద్య పరికరాలకు ప్రభుత్వం 5 ఎకరాలు లోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% రాయితీ ఇస్తుందన్నారు. 10 ఎకరాల వరకు భూమి ఉన్న బీసీ, జనరల్ రైతులకు 90% రాయితీ అందిస్తారన్నారు. ప్రతి రైతు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.