'లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు'

'లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు'

చిత్తూరు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా లేదా ప్రోత్సహించినా క్రిమినల్ కేసులు నమోదు చేసి సెంటర్లను సీజ్ చేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖప్రసవాలు పెంచాలని, అనవసర సిజేరియన్లు తగ్గించాలని అన్నారు. జిల్లాలోని 78 స్కానింగ్ సెంటర్లపై కఠిన తనిఖీలు చేయాలని ఆయన సూచించారు.