నారాయణతో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ భేటీ
PLD: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి పొంగూరు నారాయణని సచివాలయంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి, పట్టణంలో మౌలిక వసతుల మెరుగుదల, రోడ్లు, డ్రైనేజ్, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు.