సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రూ.7.46 లక్షలు ఆదాయం

కృష్ణా: మోపిదేవిలోని శ్రీవల్లి దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఆదివారం ఒక్కరోజు భక్తులు సమర్పించిన ఆదాయం రూ.7,46,216 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాద్ తెలిపారు. సోమవారం దేవస్థానంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.