2 నెలల వ్యవధిలో ముగ్గురు మహిళల హత్యలు
NZB: నవీపేట PS పరిధిలో 2 నెలల వ్యవధిలో 3 హత్యలు చోటు చేసుకోవడం కలకలం రేపుతున్నాయి. గత నెలలో గుర్తుతెలియని మహిళను హత్య చేసి గోనె సంచిలో ఉంచి శివారులో పడేశారు. ఈ ఘటనలో మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. వారం రోజుల క్రితం ముదక్ పల్లికి చెందిన శ్యామల లక్ష్మి నవీపేట శివారులో హత్యకు గురైంది. ఈ ఘటనలు మరువకముందే శనివారం మరో మహిళ తల, చేతులు నరికేసి నగ్నంగా పడి ఉండడం కలకలం రేపుతోంది.