మద్యం షాపు ముందు శివ శంకర్.. వీడియో వైరల్

మద్యం షాపు ముందు శివ శంకర్.. వీడియో వైరల్

KRNL: కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన శివశంకర్, ఎర్రిస్వామికి సంబంధించిన మరో సీసీటీవీ వీడియో బయటికొచ్చింది. ప్రమాదానికి ముందు పెద్దటేకూరు గ్రామంలోని వైన్స్‌లో 7PMకు ఒకసారి, 8.25PMకు మరోసారి వారిద్దరు మద్యం కొన్నట్లు సీసీ టీవీలో రికార్డు అయింది. ఆ తర్వాత మద్యం మత్తులో బైక్ నడపగా యాక్సిడెంట్‌కు గురై శివశంకర్ మృతి చెందాడు. రోడ్డుపై పడిన ఆ బైక్ మారణ హోమానికి కారణమైంది.